Kondapalli Srinivas on Botsa Issue: వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ కాళ్లు పట్టుకున్నట్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అంత అవసరం తనకు లేదని మంత్రి కొండపల్లి స్పష్టం చేశారు. విజయనగరంలో బొత్స సత్యనారాయణ కుటుంబ పాలన పోయి కూటమి పాలన వచ్చిందని వెల్లడించారు. వైఎస్సార్సీపీ నేతలు కావాలి అనే తనపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొందరు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.