గోదావరి -బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సమగ్ర నదులు అనుసంధానంతోనే రాష్ట్రంలో కరవు, ఇతర విపత్తులు ఎదుర్కోగలమని తెలిపారు. ప్రభుత్వం సక్రమంగా పనిచేసి నీటిని ఒడిసిపట్టుకోవటంతో 729 టీఎంసీల నీరు నిల్వచేసుకోగలిగామన్నారు. సమగ్ర నదుల అనుసంధానం చేస్తే భవిష్యత్తులో నీటి సమస్యలు ఉండవని సీఎం స్పష్టం చేశారు.