సైబర్ నేరగాళ్లు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో తరహాలో ఎత్తులు వేస్తూ ప్రజలను ఏమార్చుతున్నారు. సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పించినా బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఓవైపు ఉద్యోగాలు, బహుమతులు అనే ఆశలను ఎరగా వేస్తున్నారు. మరోవైపు ప్రముఖుల సామాజిక మాధ్యమాల ఖాతాల డీపీలను ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కానీ వారు ఇప్పుడు రూట్ మార్చారు. ఏకంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వెబ్సైట్లను పోలిన ఫేక్ వెబ్సైట్స్ని సృష్టిస్తున్నారు. పొరపాటున ప్రజలు వాటిని ఆశ్రయిస్తే ఖాతాలు ఖాళీ చేసి మాయమవుతున్నారు.