Tribal Protest in Anakapalli Collectorate : శాస్త్రసాంకేతిక రంగలో మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం. కానీ దేశంలోని చాలా ప్రాంతాలకు ఇప్పటికి సరైన రోడ్డు సౌకర్యాలు లేవు. ఇక కొండకోనల్లో ఉండే గిరిజనుల పరిస్థితి మరీ దయనీయమని చెప్పవచ్చు. అక్కడ ఎవరైనా ఆనారోగ్యానికి గురయ్యారంటే వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లాలంటే డోలీలే దిక్కు. ఎప్పుడే ఇబ్బంది వచ్చినా వైద్యం కోసం సాహసం చేయక తప్పని స్థితి. డోలీ కట్టి కిలోమీటర్ల మేర తీసుకుళ్తే గానీ ఆసుపత్రికి చేరుకోలేని దయనీయ స్థితి వారిది.
