Gramasabalu In Telangana : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డుసభల్లో చెదురుమదురు గొడవలు మినహా తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల జారీ కోసం చేపట్టిన సర్వేతో అర్హుల గుర్తింపులో అక్కడక్కడ నిరసనలు వ్యక్తమమ్యాయి. జాబితాలో పేరు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అధికారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని వారికి భరోసా కల్పించారు. మంగళవారం మెుదలైన ఆ సభలు నెల 24వ తేదీతో ముగియనున్నాయి.
