Alaknanda Kidney Racket Case Update : హైదరాబాద్ సరూర్ నగర్‌లో అలకనంద ఆసుపత్రిలో అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి నిజమేనని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఆర్ధిక కారణాలతోనే తమిళనాడు, కర్నాటకల నుంచి వచ్చిన ఇద్దరు వితంతువులు కిడ్నీలు విక్రయించినట్లు ఒప్పుకున్నారని డీఎంఈ వాణి వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేసేందుకు ఉస్మానియా ఆస్పత్రి మాజీ సుపరింటెండెంట్ నాగేందర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. కిడ్నీ మార్పిడి కోసం వచ్చిన ఇద్దరు దాతలు, ఇద్దరు గ్రహీతలు మొత్తం నలుగురు గాంధీ ఆసుపత్రిలో ఉన్నారు