Surprise Me!

వారసత్వం ఓ మిథ్య : సీఎం చంద్రబాబు

2025-01-23 2 Dailymotion

Chandrababu Davos Tour Updates : వారసత్వంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో వారసత్వం ఓ మిథ్యన్నఆయన అవకాశాలు అందిపుచ్చుకున్నవారే ఏ రంగంలోనైనా రాణిస్తారని స్పష్టం చేశారు. లోకేశ్‌కు వ్యాపారం అయితే తేలికన్న చంద్రబాబు కానీ సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. దేశానికి నాలుగోసారీ మోదీయే ప్రధాని అవుతారని పేర్కొన్నారు. కేంద్రమంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. విధ్వంసానికి గురైన ఏపీని తిరిగి నిలబెట్టడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. జగన్‌ హయాంలో అవినీతి, అక్రమాలపై చట్టపరంగానే చర్యలు ఉంటాయని ఎక్కడా కక్షసాధింపు ఉండబోదని వెల్లడించారు.

Buy Now on CodeCanyon