Visakhapatnam Juvenile Home Issue: విశాఖపట్నంలోని ప్రభుత్వ ప్రత్యేక బాలికల వసతి గృహం (జువైనల్ హోం) ఎదుట రెండవ రోజూ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమను బయటకు పంపాలంటూ బాలికలు గోడ దూకి బయటకు పారిపోయే ప్రయత్నం చేశారు. బుధరావం జరిగిన ఘటనపై విచారణ జరిపేందుకు విద్యార్థి, మహిళ, బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు జువైనల్ హోంకి చేరుకున్నారు. అయితే వారిపై కూడా బాలికలు రాళ్లు విసిరారు. తమను బయటకు పంపాలంటూ అరుస్తూ చిత్రవిచిత్రంగా ప్రవర్తించారు.