Surprise Me!

ఇవాళ అసెంబ్లీ ఉభయసభల కీలక సమావేశం

2025-02-04 5 Dailymotion

Telangana Assembly special session : సామాజిక ఆర్థిక సర్వే, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ నివేదికలపై చర్చే ప్రధాన అజెండాగా అసెంబ్లీ ఉభయ సభలు ఇవాళ సమావేశం కానున్నాయి. శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై తీర్మానం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతకంటే ముందే అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశం కానున్న మంత్రివర్గం కుల గణన సర్వే, ఎస్సీ కమిషన్‌ నివేదికలపై చర్చించి ఆమోదం తెలపనుంది.

Buy Now on CodeCanyon