Surprise Me!

వైభవంగా అంతర్వేది నృసింహస్వామి రథయాత్ర

2025-02-08 0 Dailymotion

East Godavari Antarvedi Narasimha Swamy Kalyana Mahotsavam Rath Yatra : సాగర సంగమ తీరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సౌభాగ్య ప్రదాయిని శ్రీదేవి, భూదేవితో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన నరసింహస్వామికి అంతర్వేది ఆలయ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి దివ్య పరిణయోత్సవం నిర్వహించారు. 2.05 గంటలకు రథయాత్ర ప్రారంభమయ్యింది. పోలీసులు దారి పొడవునా భారీ బందోబస్తుకు ఏర్పాట్లు చేశారు. రథం తిరిగే మార్గంలో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. మూడు గంటలకుపైగా జరిగిన ఈ పరిణయ మహోత్సవ క్రతువును అశేష భక్తజనం తిలకించి పులకించారు.

Buy Now on CodeCanyon