GREEN ENERGY CORRIDOR TO UTTARANDHRA: రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు 12 వందల సర్క్యూట్ కిలోమీటర్ల ‘గ్రీన్ ఎనర్జీ కారిడార్’ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సీమ జిల్లాల్లోని పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్‌ను ఉత్తరాంధ్రలో వాడుకునేలా కారిడార్ ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది. ఇందుకోసం కేంద్ర సాయం కోరుతోంది.
