మేడారంలో సమ్మక్క-సారలమ్మల చిన్నజాతరకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి నాలుగు రోజులపాటు ఘనంగా జరగనుంది. గద్దెలను శుద్ధి చేసి... గ్రామంలోకి దుష్టశక్తులు రాకుండా ఆలయ పూజారులు తొలిరోజు దిష్టి తోరణాలు కట్టడంతో ఉత్సవం ప్రారంభమవుతుంది. పెద్ద జాతరకు రాని వాళ్లు.. తమ మెక్కులు చెల్లించడం కోసం ఈ జాతరకు విచ్చేస్తారు. కాగా.... భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.