Surprise Me!

శ్రీవారిని దర్శించుకున్న తండేల్‌ చిత్ర బృందం

2025-02-13 0 Dailymotion

Thandel Team Visit in Tirumala : తిరుమల శ్రీవారిని తండేల్‌ చిత్రబృందం దర్శించుకుంది. నాగచైతన్య, సాయిపల్లవి, అల్లు అరవింద్‌, చందూ మొండేటి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ సిబ్బంది వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వదించి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారితో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. దీంతో ఆలయ ప్రాంగణం వద్ద సందడి నెలకొంది.

Buy Now on CodeCanyon