Surprise Me!

విద్యార్థులకు ఉచిత కంటి అద్దాల పంపణీ

2025-02-14 2 Dailymotion

Minister Satyakumar Yadav Distributed Free Eye Glasses to Students : కేంద్రం సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కంటిచూపుతో ఇబ్బందులు పడుతున్న 20 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా, వారిలో 90 వేల మంది విద్యార్థులకు కంటి అద్దాలు అవసరమని గుర్తించామన్నారు. వారందరికీ కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండల కేంద్రం ఏపీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే శ్రావణి శ్రీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Buy Now on CodeCanyon