Surprise Me!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్‌- త్వరలోనే ఉచిత ఆరోగ్య బీమా పథకం అమలు

2025-02-21 2 Dailymotion

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో కీలక పథకం అమలు చేసేందుకు సిద్ధపడింది. ఆరోగ్య శ్రీతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత ఆరోగ్య బీమా అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ పథకం అమలుకు ప్రభుత్వం ప్రక్రియ చేపట్టబోతోంది. దీనికి ముందు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనుంది. అందులో తక్కువకు కోట్ చేసిన వాళ్లకు ఈ టెండర్లు ఇవ్వనుంది. ప్రస్తుతం ఐదు లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి ఆరోగ్య శ్రీ ద్వారా సేవలు అందుతున్నాయి. ఇప్పుడు బీమా పథకం అమలులోకి వస్తే దాదాపు అన్ని వర్గాల వారికి ఉచిత వైద్య సేవలు లభించనున్నాయి. 

Buy Now on CodeCanyon