Surprise Me!

రాగల రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం : వాతావరణ శాఖ

2025-02-24 0 Dailymotion

IMD Officer On Telangana Weather Report : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఖమ్మం, మహాబూబ్‌ నగర్‌, మెదక్‌ జిల్లాల్లో సాధారణాన్ని మించి రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. గాలి అనిశ్చిత్తి వల్ల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయని రాగల రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ మేర తగ్గే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. గాలి అనిశ్చిత్తి కారణంగా ఒకరోజు ఉత్తర మరొక్క రోజు దక్షిణ తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటుని వివరించారు. ఈ మేరకు తెలంగాణ వాతావరణ పరిస్థితిపై ఆయన వివరాలను వెల్లడించారు.

Buy Now on CodeCanyon