Lokesh Counter YSRCP MLCs : గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం వేళ శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడీవేడీ చర్చ సాగింది. వర్సిటీల్లో వీసీల నియమాకం కోసం గత ఉప కులపతులను బెదిరించి రాజీనామా చేయించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర వాగ్వాదానికి తీరి తీసింది. వాటిని నిరూపించాలని మంత్రి లోకేశ్ డిమాండ్ చేశారు. అయితే జ్యుడీషియల్ విచారణ చేయాలని వైఎస్సార్సీపీ కోరింది.