Surprise Me!

హెచ్​ఎండీఏ పరిధి ఆర్​ఆర్​ఆర్​ వరకు - ఆ జిల్లాల్లో విస్తరణ

2025-03-07 15 Dailymotion

Telangana Cabinet Meeting : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(HMDA) పరిధిని ఆర్​ఆర్​ఆర్​ వరకు విస్తరించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించాలని కేబినెట్​ నిర్ణయించింది. దాని కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్​ సిటీ డెవలప్​మెంట్​ అథారిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. తెలంగాణ టూరిజం పాలసీ 2025-20230కి కేబినెట్​ ఆమోదముద్ర వేసింది.<br /><br />నాగార్జునసాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్య సుమారు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికోసం ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ(FDCA) ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(HMDA) పరిధిని ఆర్​ఆర్​ఆర్​ వరకు విస్తరించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హెచ్​ఎండీఏ పరిధి 11 జిల్లాల్లోని 104 మండలాల్లోని 1,355 గ్రామాలకు విస్తరించనుంది. కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు హెచ్​ఎండీఏ పరిధిలోకి వస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

Buy Now on CodeCanyon