Botsa Comments on Amaravati : శాసనమండలిలో రాజధాని అమరావతి స్మశానమని వైఎస్సార్సీపీ, మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై అమరావతి బహుజన ఐకాస నేతలు మండిపడ్డారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ పార్టీ ఎమ్మెల్సీలు రాజధాని ఘోస్ట్ సిటీ అని, స్మశానమని వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. విజయవాడలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
