International Womens Day Celebrations Held Grandly in AP : స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకుంటే గమనం లేదు. స్త్రీ లేకుంటే అసలు సృష్టే లేదు. తల్లిగా, చెల్లిగా, భార్యగా కుటుంబ భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తారు మహిళలు. అంతటి గొప్ప మహిళలకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన మహిళలనుసత్కరించారు. నారీ శక్తికి వందనం అంటూ కీర్తించారు.