Surprise Me!

ఇద్దరు చిన్నారులకు అరుదైన వ్యాధి - వైద్యానికి రూ.32 కోట్లు - ఆపన్నహస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు

2025-03-10 5 Dailymotion

A poor Family Seeking For Help : అందరు పిల్లలు మాదిరిగానే వారికీ కేరింతలు కొడుతూ ఆకాశాన హరివిల్లు విరిస్తే అల్లరి చేస్తూ ఆనందించాలని ఆ పసిపిల్లలకూ ఆశే కానీ, విధి వారి సంతోషాలను దూరం చేసింది. వారు అందరు చిన్నారుల్లా ఆడలేరు, ఉత్సాహంగా కదలలేరు. కూర్చొంటే మోకాళ్లపై చేతులు ఆనించి నిల్చోవాల్సిందే. ఆ చిన్నారుల దయనీయ పరిస్థితి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. కండరాల క్షీణతతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు చికిత్స చేయించడానికి రూ.32కోట్ల ఖర్చువుతుందని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఆపన్నహస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

Buy Now on CodeCanyon