Betting Apps Case Update : నిషేధిత బెట్టింగ్ యాప్స్ ప్రచారం వ్యవహారంపై పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. బెట్టింగ్ యాప్స్ సైట్స్ ప్రచారంపై మియాపూర్‌కు చెందిన వ్యాపారి ఫణీంద్ర శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో 11 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసు నమోదైంది. ఎంతోమంది యువత ఆత్మహత్యలు, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేస్తున్న బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం కల్పిచడం చర్చనీయాంశంగా మారిన తరుణంలో సినీ ప్రముఖులపై కేసులు నమోదుకావడంతో మరో మలుపు తీసుకుంది.<br /><br />ప్రముఖనటులు దగ్గుబాటి రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, విజయ్‌దేవరకొండ, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, వైఎస్సాఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామలపై మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పలువురు బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు తదితరుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.