CM Chandrababu Review Summer Precautions : రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో వేసవి ప్రణాళికపై విపత్తు నిర్వహణ, పంచాయితీరాజ్, మున్సిపల్, వైద్యారోగ్యశాఖల పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఉష్ణోగ్రతల తీవ్రతలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు మొబైల్ ఫోన్ల ద్వారా చేరవేయాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలు నివారించాలని స్పష్టం చేశారు. తీవ్ర వడగాలులు వీచే ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పశువుల కోసం గ్రామాల్లో రూ.35 కోట్లతో 12,138 నీటితొట్ల నిర్మాణం చేయాలని సూచించారు. పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలన్నారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. అడవుల్లో అగ్నిప్రమాదాలుపై అప్రమత్తంగా ఉండాలి, డ్రోన్లతో పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.
