AP Liquor Scam Updates : లోక్‌సభలో ఫైనాన్స్ బిల్లుపై సోమవారం జరిగిన చర్చలో మాట్లాడిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఏపీలో గత ఐదేళ్లలో జరిగిన మద్యం కుంభకోణం అంశాన్ని ప్రస్తావించారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు రూ.1700 కోట్ల నుంచి రూ.2000ల కోట్ల వరకు వసూలు చేశాయన్న ఆయన ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల్లో లిక్కర్ పేరిట అంతకుమించి వసూళ్లు జరిగాయని తెలిపారు.