Telangana CM Revanth Reddy on Education System in Council Sessions : ప్రతిస్థాయిలో విద్యా రంగం రోజు రోజుకూ క్షీణించిపోతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారిని ప్రోత్సహించేలా చర్యలు ఉండాలని అన్నారు. శాసన మండలిలో విద్యాశాఖపై సీఎం మాట్లాడారు. ఈ తరుణంలో సభలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని సూచించారని సీఎం తెలిపారు. ఈ విషయంపై చర్చించాలని సీఎం అన్నారు. చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కలగ చేసుకొని ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలనే నిబంధన తీసుకురావాలని అనగా దానికి సీఎం సమాధానం చెప్తూ ఆ మాట అనే ధైర్యం తనకు లేదని అన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించే వారికే ప్రభుత్వ ఉద్యోగంపై చర్చిస్తే బాగుంటుందని సూచించారు.
