Building Collapses in Bhadrachalam : భద్రాచలం పట్టణంలో ఐదంతస్తుల భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకొని కామేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక సహాయ బృందాలు కామేశ్వరరావును బయటకు తీసుకొచ్చాయి. భవనం శిథిలాల కింద మరో వ్యక్తి ఉపేందర్ ఉన్నారు. అతడిని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.<br /><br />అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో భద్రాచలం సూపర్ బజార్ సెంటర్‌లో నిర్మాణంలో భవనం ఉన్నట్లుండి ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అందులో పనిచేసేందుకు వచ్చిన ఇద్దరు తాపీ కార్మికులు చిక్కుకుపోయారు. సమాచారం అందిన వెంటనే కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్ సంఘటనా స్థలానికి వెళ్లి రెస్క్యూ సిబ్బందితో శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. శిథిలాలను తొలగించే యత్నంలో గ్రౌండ్ ఫ్లోర్ పిల్లర్లు, స్లాబ్ కూలాయి. దానిపై మిగిలిన అంతస్తుల స్లాబ్‌లు పేర్చినట్లు పడిపోయాయి.