CM Chandrababu Polavaram Visit: కూటమి ప్రభుత్వంలో పోలవరం నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. అధికారం చేపట్టిన 9 నెలల కాలంలోనే సీఎం మూడోసారి పోలవరానికి వెళ్తున్నారంటనే ప్రాజెక్టుకు ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టమవుతోంది. పునరావాసం, పరిహారం సహా పలు అంశాలపై నేడు సీఎం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఉదయం 10 గంటల 55 నిమిషాలకు పోలవరం వ్యూ పాయింట్‌కు వెళ్లనున్న సీఎం, మధ్యాహ్నం 3 గంటల వరకు పరిశీలన జరపనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.