DUVVADA SRINIVAS WARNING TO ELECTRICAL AE: శ్రీకాకుళం జిల్లా టెక్కలి విద్యుత్ శాఖ ఏఈని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బెదిరించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన దురుసు వైఖరితో మరోసారి వివాదాస్పదమయ్యారు. తన ఇంటికి మూడు నెలలుగా విద్యుత్ బిల్లులు చెల్లించకుండా బకాయి పెట్టిన ఆయన, కనెక్షన్ తొలగించినందుకు ఏఈపై విరుచుకుపడ్డారు.
