Drilling In to The Temple : మహబూబాబాద్ జిల్లా కంభాలపల్లి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో గుప్త నిధుల కోసం గర్భగుడికి డ్రిల్లింగ్ మిషన్ ద్వారా రంధ్రాలు చేసిన ఘటన చోటు చేసుకుంది. ఆలయ అర్చకులు రోజు మాదిరిగానే శనివారం రాత్రి స్వామి వారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించిన అనంతరం ఆలయానికి తాళాలు వేసి ఇంటికి వెళ్లారు.