Lover Attacks Mother and Daughter With Knife in Visakha : విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. కొమ్మాది స్వయంకృషినగర్‌లో ప్రేమోన్మాది ఓ యువతి ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి లక్ష్మి (43) మృతి చెందగా కుమార్తె దీపిక (20)కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు దీపికను సమీపంలోని గాయత్రి ఆస్పత్రికి తరలించారు. తల్లి, కుమార్తెపై దాడి చేసిన యువకుడు నవీన్ పరారయ్యాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
