Heavy Rains in Hyderabad : జోరు వానతో హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దైంది. నిన్నటి వరకు పెరిగిన ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కరైన నగరవాసులకు వర్షం ఉపశమనం కల్పించినప్పటికీ ప్రధాన రహదారులపై వరద నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడం, పలు చోట్ల చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
