Surprise Me!

వెళ్తున్న ఆటోపై కూలిన ప్రహారీ గోడ - ఇద్దరికి గాయలు

2025-04-04 21 Dailymotion

Wall Collapse In Kharmanghat : నిర్మాణంలో ఉన్న ప్రహారీ గోడ కూలిన ఘటనలో పలువురు గాయపడ్డ ఘటన హైదరాబాద్‌లోని కర్మాన్‌ఘాట్‌లో చోటుచేసుకుంది. ఘటనలో గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కర్మాన్‌ఘాట్‌లో నివసించే నేనావత్ అనిల్, సరోజ, భాను ప్రసాద్, రమావత్ అనిల్, రెండేళ్ల చిన్నారి నందిని ఓకే కుటుంబ సభ్యులు. వీరు గురువారం సాయంత్రం యంజాల్‌లోని ఒక ఫంక్షన్‌కు తమ ఆటోలో వెళుతుండగా నిర్మాణంలో ఉన్న ప్రహారీ గోడ ఒక్కసారిగా కూలీ ఆటోపై పడింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో సరోజ, అనిల్‌కు గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా కనీసం బిల్డింగ్ సంబంధించిన యజమానులు కానీ ఎవరు కూడా సాయం చేయలేదని వాపోయారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Buy Now on CodeCanyon