Chhattisgarh Maoists Surrender to Police : మావోయిస్టులకు నెల రోజుల వ్యవధిలో రెండు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. గత నెలలో 64 మంది మావోయిస్టులు లొంగిపోగా ఇప్పుడు ఏకంగా 86 మంది లొంగిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వీరంతా మల్టీజోన్-1 ఐజీ పి.చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో లొంగిపోయారు. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు భారీ సంఖ్యలో సరెండర్లు జరిగాయని ఐజీ తెలిపారు.