Mulagalampalli Headmaster Campaign : ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు బలోపేతం కావాలనే సర్కార్ లక్ష్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఆ ఉపాధ్యాయుడు. ఇక్కడ అందించే విద్యాప్రమాణాలు, సౌకర్యాలు ప్రైవేట్ స్కూల్స్‌కి ఏ మాత్రం తీసిపోదని తనదైన శైలిలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివించాలని వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఆయనే ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మూడు రమేష్ బాబు.