KTR on Election in Telangana : ఉప ఎన్నికలు ఈ ఏడాదిలోనే వస్తాయని అందరూ సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జోస్యం చెప్పారు. అత్తాపూర్ డివిజన్ కాంగ్రెస్ నేత వనం శ్రీరామ్‌రెడ్డి ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వడంతో తినే కంచంలో మన్ను పోసుకున్నట్లయిందని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలన్నీ బోగస్, ఆరు గ్యారంటీల్లో ఒకటి కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. బస్సుల్లో ఆడవాళ్లు కొట్టుకునే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా క్షీణించిందన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలున్న కాంగ్రెస్ నేతలను హైడ్రా ముట్టుకోదని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్ కంటే ప్రజలే ఎక్కువ నష్టపోయారని అన్నారు.
