INCOMPLETE BRIDGE: గోదావరికి వరద వచ్చిందంటే చాలు.. ఆ ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకుండదు. వానాకాలమంతా పడవలపైనే ప్రయాణం. కష్టాలు తీర్చేందుకు వేసిన కాలిబాట సైతం వరదకు కోతకు గురై కనుమరుగవుతోంది! శాశ్వత వంతెన కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నా ఆ కల ఇప్పట్లో నెరవేరేలా లేదు. నిధుల కొరతతో ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా బ్రిడ్జి నిర్మాణం సాగుతోంది. గడువు తీరినా వంతెన పూర్తికాకపోవడంతో ఈ సీజన్‌కు కూడా వరద కష్టాలు తప్పేలా లేవని లంకవాసులు కలవరం చెందుతున్నారు.