SS Thaman And Gopichand Malineni Visited Tirumala : తిరుమల శ్రీవారిని సినీ సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు గోపీచంద్ మలినేని, నటుడు అశ్విన్ బాబు దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో వారు పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
