PM Modi Foundation Stone for Amaravati Works: మే 2న రాజధాని అమరావతిలో లక్ష కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. రాజధానిలోని వేర్వేరు పనుల్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నట్టు మంత్రి వెల్లడించారు. ప్రధాని పర్యటన దృష్ట్యా ఏర్పాట్లపై మంత్రుల కమిటీలో వివిధ అంశాలను చర్చించామని తెలిపారు. ఇప్పటికే అధికారులందరికీ పర్యటన, హెలిపాడ్లు, బహిరంగ సభ, రోడ్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు ఇలా వేర్వేరు బాధ్యతలు అప్పగించామని వెల్లడించారు. <br /><br />
