Two Bangladeshi Nationals Arrested in Hyderabad : దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయులకు జనన ధ్రువీకరణ పత్రాల మంజూరు కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఢాకా నుంచి అక్రమంగా కోల్‌కతా చేరి, అక్కడి నుంచి హైదరాబాద్‌లో స్థిరపడ్డ మహ్మద్ హసిబుల్ కేసులో తీగ లాగితే డొంక కదిలింది. నిందితుల్లో నార్సింగి మున్సిపాలిటీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సుధీర్ కుమార్, ఏజెంట్లు మహ్మదులీజ్, టి.సాయికిరణ్, రజనీకాంత్, బంగ్లా దేశస్థులు మహ్మద్ హసిబుల్, రోహన్ ఉన్నారు. నిందితుల నుంచి 7 సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, నకిలీ ఆధార్, ఓటర్ గుర్తింపు, బర్త్ సర్టిఫికెట్లు, బంగ్లా పాస్‌పోర్టు స్వాధీనం చేసుకున్నారు.<br /><br />