CM Chandrababu at VIT University : విద్యార్థులు చదువు తర్వాత ఉద్యోగంతో సంతృప్తి చెందకుండా గ్లోబల్ సిటిజన్స్‌గా ఎదగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతిలోని విట్ యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన భవనాలను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మైక్రోసాఫ్ట్, గూగుల్‌తో పాటు అంతర్జాతీయ సంస్థలు భారతీయులు, తెలుగు వారి నాయకత్వంలో నడుస్తున్నాయని తెలిపారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. అమరావతిలో ఏర్పాటు చేసే విద్యా సంస్థల్లో కేవలం ఏపీ విద్యార్థులే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల విద్యార్థులు ఉండాలని, అప్పుడే విద్యార్థులు గ్లోబల్ సిటిజన్స్‌గా తయారవుతారని చెప్పారు. త్వరలో అమరావతిలో రతన్ టాటా ఇన్మోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.