Surprise Me!

బీఆర్‌ఎస్‌ నేతల నిర్లక్ష్యం, కక్కుర్తి, అవినీతి వల్ల ప్రాజెక్టు పనికిరాకుండా పోయింది

2025-04-29 3 Dailymotion

Minister Uttam Kumar Reddy on NDSA Report on Kaleshwaram Project : పదేళ్ల అధికారంలో ఉన్న వాళ్ల అసమర్థత, అవినీతి, నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్​డీఎస్​ఏ నివేదికపై సచివాలయంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన మంత్రి ఎక్కువ కమిషన్ల కోసమే గత పాలకులు కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారన్నారు. 80 వేల కోట్లకు అనుమతి తీసుకుంటే ఇప్పటికే లక్ష కోట్లు దాటిపోయిందన్నారు. వివిధ కార్పొరేషన్ల పేరుతో అధిక వడ్డీకి రుణాలు తీసుకున్నారన్న ఉత్తమ్‌ వడ్డీ కింద 16 వేల కోట్లు కడుతున్నట్లు వివరించారు. బ్యారేజీల భద్రతపై ఎన్​డీఎస్​ఏ అత్యున్నత బోర్డు అని వివరించిన మంత్రి బీఆర్​ఎస్​ నేతల విమర్శలు సిగ్గుచేటని మండిపడ్డారు.

Buy Now on CodeCanyon