Miss World Contestants Events Schedule in Hyderabad : తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా, ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు నెల రోజుల పాటు జరిగే పోటీల కోసం షెడ్యూల్‌ను ఖరారు చేసింది. చారిత్రక ప్రదేశ పర్యటన, ఆధ్యాత్మికత వెల్లివెరిసేలా ఆలయాల దర్శనం, మెడికల్ టూరిజం ప్రోత్సహించే కార్యక్రమాలు, స్పోర్ట్స్ మీట్లు, గాలా డిన్నర్‌లతో ఆకట్టుకునేలా కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఈ మేరకు షెడ్యూల్తో పాటు మిస్ వరల్డ్ లోగోను సైతం ఖరారు చేసింది. మిస్ వరల్ట్ లిమిటెడ్ సీఈఓ జూలియా ఈవేలిన్ మోర్లీ రాకతో పోటీల సందడి ప్రారంభమైంది.