Man Killed Wife in Jagtial : వివాహమై 20 సంవత్సరాలు గడిచినా కట్నం తేలేదని, పిల్లలు కలగలేదని ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన అవుదుర్తి మహేందర్, మమతలకు 20 ఏళ్ల కింద వివాహం జరిగింది. కానీ ఇప్పటికీ సంతానం లేదు. దంపతులిద్దరూ కరీంనగర్లో దర్జీ పని చేసుకుని ఉపాధి పొందుతున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే మహేందర్ మద్యానికి బానిసయ్యాడు. పెళ్లై 20 ఏళ్లయినా ఇప్పటికీ కట్నం డబ్బులు తేలేదంటూ ఇద్దరి మధ్య ఇటీవల ఘర్షణ జరగగా, మమత పుట్టింటికి వెళ్లిపోయింది.