Earthquakes In North Telangana : ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భూమి కంపించింది. సాయంత్రం సమయంలో కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భూమిలో ప్రకంపనలు జరిగాయి. సుమారు 2 నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంప లేఖినిపై తీవ్రత 3.8గా నమోదైంది. కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల స్వల్ప భూప్రకంపనలు జరిగాయని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా గంగాధర, చొప్పదండి, రామడుగు మండలాల్లో రెండు సెకన్ల పాటు ప్రకంపనలు జరిగాయి. దీంతో జిల్లా ప్రజలు ఆందోళనకు గురయ్యారు.<br /><br />
