Interview With IMD Officer Srinivas Rao About Rains : రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. ఇవాళ, రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో రాత్రి సమయాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ రావుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
