VARIETY THIEF IN KADAPA DISTRICT: అతను ఒక మెకానిక్. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ల వద్ద పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను చాకచక్యంగా తాళం తీసి ఎత్తుకెళ్లడంలో ఆయన ఘనాపాటి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 10 లక్షల రూపాయల విలువైన 16 ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు. అందులోనూ హీరో కంపెనీకి చెందిన వాహనాలను మాత్రమే తీసుకెళ్లాడు. వాటి విడిభాగాలను ఈజీగా అమ్ముకోవచ్చన్నది ఆ మెకానిక్ దొంగ ఉద్దేశం.