ఉపముఖ్యమంత్రిగా వచ్చే జీతాన్ని తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికే ఖర్చుచేయనున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు పవన్ కళ్యాణ్ తన వేతనం నుంచి ఒక్కొక్కరికీ నెలకి 5 వేల రూపాయలు ఇవ్వనున్నారు.