Minister Satya Kumar On AP Liquor Scam : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం ద్వారా ప్రపంచమంతా విస్తుపోయేలా అవినీతి చేశారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. బహుశా మద్యం కుంభకోణం విషయంలో ప్రపంచ చరిత్రలో మొదటి సారి ఈ అవినీతిని చూస్తున్నామని తెలిపారు. అప్పటి ప్రభుత్వాధినేతే స్వయంగా డిస్టలరీలు పెట్టడం, సొంత బ్రాండ్లు తయారుచేయించడం ప్రపంచంలో ఎక్కడా చూడలేదన్నారు. ఈ కుంభకోణంలో వేల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించారు. 2014-19 మధ్య 49వేల కిడ్నీ కేసులు వస్తే 2019-2024 మధ్య 91వేల కేసులకు పెరిగాయన్నారు. లివర్ కేసులు సైతం భారీగా పెరిగినట్లు సత్యకుమార్ చెప్పారు.