Surprise Me!

సైనిక్​ స్కూల్స్ వచ్చే వరకు తెలంగాణ పిల్లలకు ఏపీలో స్థానికత్వం కల్పించాలి : మంత్రి పొన్నం

2025-05-13 9 Dailymotion

<br />Minister Ponnam Prabhakar on Sainik Schools : తెలంగాణలో సైనిక్ స్కూల్‌ ఏర్పాటు చేసే వరకు ఏపీలో తెలంగాణ పిల్లలకు స్థానికత్వం కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రం, ఏపీ సర్కార్‌ నిర్ణయంతో సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష రాసిన 20 వేల మంది విద్యార్థులు నైరాశ్యంలో ఉన్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ పిల్లలు స్థానికేతరులుగా నిర్ణయించడం వల్ల నిరాశ చెందుతుతున్నారని తెలిపారు దేశంలో అన్ని రాష్ట్రాల్లో సైనిక్‌ స్కూళ్లు ఉన్నాయన్న మంత్రి తెలంగాణలోనూ తొందరగా ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, బండి సంజయ్ ఈ విషయంపై దృష్టి సారించారని కోరారు. రాష్ట్రంలో సైనిక్‌ స్కూళ్ల ఏర్పాటుపై క్రాంతి కీన్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్లులు మంత్రి శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌ను కలిశారు.

Buy Now on CodeCanyon