Surprise Me!

ఏపీలో భారీ వర్షాలు

2025-05-16 9 Dailymotion

<br />Rains in AP : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వర్షాపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. బాపట్లజిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో కొన్నిచోట్ల చెట్లు పడిపోయి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని చీరాల, వేటపాలెం, అద్దంకి, మెదరమెట్ల, కొల్లూరు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. యద్దనపూడి మండలం వింజనంపాడులో వీచిన గాలులకు చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షంతో పట్టణంలోని రహదారులు చిత్తడిగా మారాయి. అప్రమత్తమైన పంచాయితీ సిబ్బంది చెట్టును తొలగిస్తున్నారు.

Buy Now on CodeCanyon